ఒకే రోజు 49 వేల కేసులు

25 Jul, 2020 04:41 IST|Sakshi
బక్రీద్‌ నేపథ్యంలో భోపాల్‌లో ఓ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించకుండా మేకలు కొనేందుకు గుంపులుగా ఉన్న జనం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా.. ఎక్స్‌ ప్రెస్‌ కంటే వేగంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధికంగా 49,310 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 12,87,945కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 740 మంది మరణించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శుక్రవారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,17,208కి చేరుకుంది. దీంతో మొత్తం కోలుకున్న వారి వాతం 63.45కు చేరుకుంది. మరణాల రేటు 2.38కి పడిపోయింది. పరీక్షల సంఖ్య జూలై 20 నాటికి ప్రతి 10 లక్షల మందిలో 10,180 మందికి చేరింది. లేబొరేటరీల సంఖ్య 1290కి పెంచడంతో భారీగా పరీక్షలు పెరిగినట్లు చెప్పింది.

ప్రస్తుతం దేశంలో 4,40,135 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో మరణించిన వారిలో 298 మంది మహారాష్ట్రకు, 97 మంది కర్ణాటకకు, 88 మంది తమిళనాడుకు, 34 పశ్చిమ బెంగాల్‌ కు, 28 మంది గుజరాత్‌ కు, 26 మంది ఉత్తరప్రదేశ్‌ కు, మరో 26 మంది ఢిల్లీకి, 11 మంది రాజస్తాన్‌ కు, 10 మంది మధ్యప్రదేశ్‌ కు, 9 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారని తెలిపింది. జూలై 23 వరకూ మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. గురువారం 3,52,901 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక కేసుల్లోనూ, అత్యధిక కరోనా మరణాల్లోనూ మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

కోల్‌ కతాకు విమానాల్లేవు..
లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో కోల్‌కతా విమానాశ్రయంలో జూలై 25 నుంచి 29 వరకూ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వారానికి రెండు సార్లు పూర్తి స్థాయి లాక్‌ డౌన్‌ విధిస్తోంది.  

ఢిల్లీ ఎయిమ్స్‌లో ‘కోవాగ్జిన్‌’ తొలి డోసు
భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ భాగస్వామ్యంతో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ‘కోవాగ్జిన్‌’ తొలి దశ మానవ ప్రయోగాలు ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో(ఎయిమ్స్‌) శుక్రవారం ప్రారంభమయ్యా యి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇచ్చారు. ఎయిమ్స్‌లో ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 3,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులను ఎంపి క చేసింది. ఈ ప్రయోగాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. కోవాగ్జిన్‌లో మూడు రకాల ఫార్ములేషన్స్‌ ఉన్నాయి. మొదట 50 మం దిపై తక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్‌ ప్రయోగిస్తారు. వారిలో ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకపోతే మరో 50 మందికి కొంత ఎక్కువ తీవ్రత కలిగిన వ్యాక్సిన్‌ ఇస్తారు.
 

మరిన్ని వార్తలు