రక్షణ రంగాన్ని మోదీ బలోపేతం చేశారు

22 Aug, 2021 04:06 IST|Sakshi

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా

డెహ్రాడూన్‌: రక్షణ రంగానికి సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులను పెంచడం ద్వారా ప్రధాని మోదీ రక్షణ రంగాన్ని బలోపేతం చేశారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం వ్యాఖ్యానిం చారు. ఉత్తరాఖండ్‌లోని రైవాలాలో మాజీ సైనికు లతో ఆయన చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. 2011–12లో రూ. 1,45,000 కోట్లుగా ఉన్న రక్షణరంగ బడ్జెట్‌ నేడు రూ. 4,78,000 కోట్లకు చేరుకుందని అన్నారు. ప్రధాని మోదీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చెప్పడానికి ఈ అంకెలు చాలని పేర్కొన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి శంకుస్థాపన చేసిన ప్రపంచ పొడవైన సొరంగ హైవే (9.02 కిమీ) మోదీ హయాంలో పూర్తయిందన్నారు. 10 వేల అడుగుల ఎత్తులో మనాలిని లేహ్‌తో కలుపుతున్న ఈ సొరంగ మార్గం యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు స్తబ్ధుగా ఉండిపోయిందన్నారు. నిర్ణయాత్మ కతతో పాటు ముందుచూపు కలిగిన ప్రధాని మోదీ ఢిల్లీలోని వార్‌ మెమోరియల్‌ నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఆర్మీలో ఒకే ర్యాంక్‌–ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలు చేశారని చెప్పారు. నిర్ణయాలు తీసుకొనే అధికారా న్ని మోదీ సాయుధ బలగాలకు ఇచ్చారని చెప్పారు. పదేళ్ల క్రితం అలాంటి నిర్ణయాల కోసం ప్రభుత్వం చెప్పే వరకు బలగాలు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. 

మరిన్ని వార్తలు