Video: పాక్‌ మంత్రి ఎదుటే ఉగ్రవాదంపై కేంద్ర మంత్రి జైశంకర్‌ ఘాటు వ్యాఖ్యలు

5 May, 2023 12:12 IST|Sakshi

పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో గోవాలో వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి  హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ సదస్సుకు వచ్చిన పలు దేశాల మంత్రులను భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ మర్యాదపూరక్వంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో దాయాది పాక్‌ మంత్రి భుట్టోను కూడా నమస్కారంతో స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి ఫోటో కూడా దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండంటూ భుట్టోను జైశంకర్‌ పంపతున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అనంతరం షాంఘై సదస్సులో పాక్‌ మంత్రి సమక్షంలోనే విదేశాంగమంత్రి జై శంకర్‌ ఉగ్రవాద ముప్పు, సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద ముప్పు నిరాటంకంగా కొనసాగుతోందని దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించకూడదని అన్నారు.  సరిహద్దు తీవ్రవాదంతో సహా దాని అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని పాతరేయాలని పేర్కొన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఎస్‌సీఓ ఆదేశాలలో ముఖ్యమైనదని, దీనిపై కలిసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచారు.
చదవండి: ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి

కాగా గత 12 ఏళ్లలో తర్వాత భారత్‌ గడ్డపై పాక్‌ మంత్రి అడుగుపెట్టిన వ్యక్తి బుట్టోనే కావడం విశేషం. షాంఘై రెండురోజుల పర్యటన నిమిత్తం పాక్‌ మంత్రి బుట్టో గురువారమే గోవా చేరుకున్నారు.  ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్‌ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. .బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్‌ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు వివిదే విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టోకూడా ఈ విందుకు వచ్చారు. 

అయితే, విందులో బిలావల్‌, జైశంకర్‌ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ.. వీరిద్దరూ షేక్‌హ్యండ్‌ ఇచ్చుకొని  పలకరించుకున్నారని విశ్వసనీయ వర్గాల త్వారా తెలిసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు. మరోవైపుతే భారత్‌- పాక్‌ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చ  ఉంటుందా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
చదవండి: మణిపూర్‌: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్‌ కండిషన్‌ సీరియస్‌

మరిన్ని వార్తలు