కోవిడ్, ఉక్రెయిన్ సంక్షోభాన్ని భారత్‌ విజయవంతంగా నిర్వహించింది: మోదీ

6 Mar, 2022 15:49 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. 11 రోజులైన ఉక్రెయిన్‌పై పట్టు చిక్కకపోవడంతో ఎయిర్‌స్ట్రైక్స్‌ ఉద్ధృతం చేసింది. ఆధునాతన ఫైటర్‌ జెట్స్‌తో రష్యా సైనికులు రంగంలోకి దిగారు. 11వ రోజుకు చేరుకున్న ఈ యుద్దంలో ఐదార్‌, చెర్నిహివ్ పట్టణాలపై రష్యా మెరుపు దాడులతో విరుచుకు పడుతోంది. కీవ్‌, ఖార్కివ్‌ సహా ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటు రష్యా  బలగాలపై ఉక్రెయిన్‌ అలుపెరుగని పోరాటం చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమంతో యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ సరిహద్దు దాటారని కేంద్రం వెల్లడించింది.
చదవండి: నన్ను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చు.. జెలెన్‌ స్కీ భావోద్వేగం.. 

కాగా ఉక్రెయిన్‌ నుంచి తమ పౌరులను తరలించడంలో పెద్ద పెద్ద దేశాలే ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తాము భారతీయులను విజయవంతంగా స్వదేశానికి తీసుకురాగులుగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు. కోవిడ్‌ను విజయవంతంగా కంట్రోల్‌ చేశామని, ఇప్పుడు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను సురక్షితంగా తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఇదంతా భారత్‌కు పెరుగుతున్న ఆదరణ వల్లే సాధ్యమైందన్నారు. పెద్ద దేశాలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు పుణె యూనివర్సిటీలో మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. లబోదిబో అంటున్న రష్యా బిలియనీర్స్!

మరిన్ని వార్తలు