పాల ఉత్పత్తిలో భారత్‌ టాప్‌: ప్రధాని మోదీ

20 Apr, 2022 06:40 IST|Sakshi
ఆలూ ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న మోదీ 

బనస్కాంత (గుజరాత్‌): భారత్‌ ఏటా 8.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పాలను ఉత్పత్తి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రపంచంలో పాల ఉత్పత్తి దేశాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. దేశ పాల ఉత్పత్తి టర్నోవర్‌ వరి, గోధుమల కన్నా అధికమన్నారు. డైరీ రంగంలో చిన్నరైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

బనాస్‌ డైరీకి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న రైతుల ప్రయోజనం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. సహకార ఉద్యమ విజయవంతానికి బనాస్‌ డైరీ ఉదాహరణగా అభివర్ణించారు. బనాస్‌ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఆయన జాతికి అంకితం చేశారు.

చదవండి: (లీటర్‌ పెట్రోల్‌ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెరిగి..)

మరిన్ని వార్తలు