కరోనా: భారత్‌లో 25 లక్షలు దాటిన కేసులు

15 Aug, 2020 10:22 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌ కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తోంది. కొన్ని రోజులుగా 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 65,002 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కు చేరాయి. నిన్న ఒక్కరోజే 996 మంది మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు 49,036 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (కరోనా వాక్సిన్ :  ప్రధాని మోదీ గుడ్ న్యూస్)

దేశంలో ప్రస్తుతం 6,68,220 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 18,08,937 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం 8,68,679 పరీక్షలు చేయగా మొత్తం 2,85,63,095 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పేర్కొంది. (తెలంగాణలో 90వేలకు పైగా కరోనా కేసులు)

మరిన్ని వార్తలు