ఈ వీడియో చూసి ఐఏఎఫ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే

17 Aug, 2020 10:52 IST|Sakshi

రాయ్‌పూర్‌‌‌: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చత్తీస్‌గఢ్‌లోని ఖారున్‌ నది పరవళ్లు తొక్కుతోంది. బిలాస్‌పూర్‌లోని ఖుతాఘాట్‌ డ్యామ్‌ వద్ద ఖారున్‌ నది మహోగ్ర రూపం దాల్చింది. అయితే, ఓ వ్యక్తి అక్కడికి ఎలా వచ్చాడో ఏమో తెలియదు గానీ ఆ డ్యామ్‌ మధ్యలో చిక్కుకుపోయాడు. రక్షించండని స్థానికులను వేడుకున్నాడు. కానీ, వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో స్థానికులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అంతలోనే సమాచారం అందుకున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలీకాప్టర్‌తో రంగంలోకి దిగింది. బిలాస్‌పూర్‌ చేరుకుని కిందకు తాడు వేసి బాధితున్ని పైకి లాగి రక్షించింది. అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపిన ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) తక్షణ స్పందనపై స్థానికులు సెల్యూట్‌ చేశారు. సోమవారం ఉదయం సంఘటన జరిగింది.

మరిన్ని వార్తలు