దేశ ప్రజలకు ఆర్మీ జవాన‍్ల దీపావళి శుభాకాంక్షలు

23 Oct, 2022 13:48 IST|Sakshi

శ్రీనగర్‌: యావత్‌ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. 

‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్‌ ఇక్బాల్‌ సింగ్‌ తెలిపారు. ధంతేరాస్‌ సందర్భంగా లక్ష‍్మి పూజ నిర్వహించి.. లక్ష‍్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు.

సైనికులతో మోదీ దీపావళి వేడుకలు..
ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం!

మరిన్ని వార్తలు