చిమ్మ చీకటిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్‌.. వీడియో వైరల్‌

9 May, 2022 19:08 IST|Sakshi

Daring Midnight Rescue: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నది మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులను భారత ఆర్మీ రక్షించింది. అర్ధరాత్రి చిమ్మచీకటిలో సాహసోపేతమైన రెస్క్యూ చేపట్టి మరీ వారిని రక్షించింది.  వివరాల్లోకి వెళితే.. సునీల్‌, బబ్లూలు, జేసీబీ వాహనంలో చీనాబ్‌ నది దాటుతుండగా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు.

పైగా నీటిమట్టం క్రమంగా పెరగడంతో రక్షించేంత వరకు వాహనంపై కూర్చోవాలని అధికారులు సూచించారు. సివిల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న  ఆర్మీ జవాన్లు ముమ్మరంగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆర్మీకి చెందిన సుమారు 17 మంది రాష్ట్రీయ రైఫిల్స్‌, స్థానిక పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ సహాయక చర్యలో పాల్గొన్నారు.

ఎట్టకేలకు అర్ధరాత్రి చిమ్మ చీకటిలోనే  ఆ యువకులను రక్షించినట్లు అధి​కారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌ చల్‌ చేస్తోంది. దీంతో నెటిజన్లు పౌరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి:  ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో)

>
మరిన్ని వార్తలు