సైనికులకు సిరిధాన్యాల ఆహారం

1 Oct, 2023 05:54 IST|Sakshi

మైసూరు: దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పనిచేస్తున్న సైనికుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సిరిధాన్యాలను వారి ఆహారంలో వినియోగిస్తామని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖల సహాయ మంత్రి అజయ్‌ భట్‌ తెలిపారు. శనివారం మైసూరులోని కేంద్ర రక్షణ ఆహార పరిశోధనా ప్రయోగాలయం (డీఎఫ్‌ఆర్‌ఎల్‌)లో ‘మిలిటరీ రేషన్, పౌష్టికాంశాలతో కూడిన సిరిధాన్యాలు’అంశంపై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు.

చిరుధాన్యాల నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్‌ ఖాదర్‌ వలి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత ఎత్తైన సియాచిన్‌ లాంటి ప్రాంతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని అధికంగా ఇస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు