Galwan : వీరులు వీరే.. అంటోన్న ఇండియన్‌ ఆర్మీ

15 Jun, 2021 19:17 IST|Sakshi

లేహ్‌ : తూర్పు లద్ధాఖ్‌లో గల్వాన్‌లోయలో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఇండియన్‌ ఆర్మీ వీడియో రిలీజ్‌ చేసింది. ప్రపంచమంతా కరోనా విపత్తుతో విలవిలాడుతుండగా 2020 జూన్‌ 15న గల్వాన్‌లోయలో కీలక ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించింది. కల్నల్‌ సంతోశ్‌ కుమార్‌ నేతృత్వంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి చైనా ఆర్మీ ఆట కట్టించారు. అయితే ఈ ఘర్షణలో కల్నల్‌ సంతోశ్‌కుమార్‌తో పాటు 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా వైపు యాభై మందికి పైగా చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

వో హై గల్వాన్‌కే వీర్‌
గల్వాన్‌ ఘర్షణ చోటు చేసుకుని ఏడాది పూర్తైన సందర్భంగా వో హై గల్వాన్‌ కే వీర్‌ పేరుతో ఇండియన్‌ ఆర్మీ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. హరిహరన్‌, సోనూనిగమ్‌లతో కూడిన గాయకుల బృందం ఈ పాటను ఆలపించగా... ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇండియన్‌ సైనికులు ఏ విధంగా గస్తీ కాస్తూ దేశ భద్రతను కాపాడుతున్నారనే విషయాల్ని వీడియోలో చూపించారు. చివరగా  గల్వాన్‌  పోరాటంలో అమరులు ఈ వీడియోలో కనిపిస్తారు.  

చదవండి: Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్నది వీళ్లే ?

మరిన్ని వార్తలు