అది భారత ఆర్మీ సత్తా.. రికార్డులు బద్దలు కొట్టారు

3 Jul, 2022 12:21 IST|Sakshi

Army reconstructed two bridges.. ఇండియన్‌ ఆర్మీ తమ సత్తా ఏంటో మరోసారి చాటిచెప్పారు. అమర్‌నాథ్ యాత్రలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా భారత ఆర్మీ అద్భుతం సృష్టించింది. దీంతో, ఇండియన్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 

కరోనా తర్వాత ఎంతో వైభవంగా అమర్‌నాథ్‌ యాత్రలో భక్తులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ మార్పుల కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా జూన్ 30, జులై 1 మధ్య బల్తాల్ వద్ద కాళీమాతా ఆలయ సమీపంలోని నది ప్రవాహం వద్ద  కొండచరియలు విరిగిపడి యాత్రా మార్గంలో వంతెనలు కొట్టుకుపోయాయి. 

దీంతో, రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సంచలనం సృష్టించింది. బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయాన్ని గమనించిన ఆర్మీ జవాన్లు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన కర్రలను తరలించారు. ఇంజినీర్ రెజిమెంట్‌కు చెందిన సభ్యులను, సాంకేతిక నిపుణులను అక్కడికి రప్పించారు. వెంటనే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి కేవలం నాలుగు గంటల్లోనే అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. అమర్‌నాథ్ యాత్ర నిరాటంకంగా కొనసాగేలా చేశారు. దీంతో ఆర్మీ అందరిచేత శభాష్‌ అనుపించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్‌.. పన్నీరు సెల్వానికి షాక్‌!

మరిన్ని వార్తలు