ఆ బాలుడ్ని అప్పగించండి: ఇండియన్‌ ఆర్మీ

20 Jan, 2022 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌- చైనా సరిహద్దుల్లో తప్పిపోయిన బాలుడు మీరామ్ టారోన్‌ను తమకు అప్పగించాలని భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు గురువారం పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మీరామ్‌ టారోన్‌ అనే బాలుడుని చైనా ఆర్మీ.. కిడ్నాప్‌ చేసిందని అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎంపీ తపిర్ గావో బుధవారం ఆరోపించారు. భారత భూభాగంలోని సియాంగ్ జిల్లాలో అతను అపహరణకు గురైనట్లు తెలిపారు.

దీంతో సమాచారం అందుకున్న భారత ఆర్మీ.. హాట్‌లైన్‌ సాయంతో మీరామ్‌ టారోన్‌ విషయాన్ని పీఎల్‌ఏకు తెలిపింది. బాలుడుని పట్టుకొని ప్రొటోకాల్‌ ప్రకారం తమకు అప్పగించాలని ఇండియన్‌ ఆర్మీ.. చైనా సైన్యాన్ని  కోరింది. మూలికలు సేకరించడానికి, వేటుకు వెళ్లిన సదరు బాలుడు దారితప్పిపోయిడంతో అదృశ్యం అయినట్లు తెలుస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లో త్సాంగ్పో నది భారతదేశంలోకి ప్రవేశిస్తుందని అక్కడ బాలుడు అపహరణకు గురైనట్లు ఎంపీ తపిర్ గావో తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. రిపబ్లిక్‌ డేకు కొన్ని రోజల ముందే భారతదేశానికి చెందిన ఓ బాలుడిని చైనా కిడ్నాప్‌ చేసిందని, దీనిపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. బాలుడి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని ట్వీటర్‌లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు