శాస్త్రీయ సంగీత దిగ్గజం కన్నుమూత

17 Aug, 2020 18:56 IST|Sakshi

వయోభారంతో న్యూయార్క్‌లో కన్నుమూత

న్యూయార్క్‌ : ప్రముఖ శాస్త్రీయ సంగీత విధ్వాంసులు పండిట్‌ జస్రాజ్‌ (90) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో అమెరికన్‌ నగరం న్యూయార్క్‌లో జస్రాజ్‌ తుదిశ్వాస విడిచారు.  ఆయన తన సుదీర్ఘ కెరీర్‌లో పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జస్రాజ్‌ హర్యానాలోని హిస్సార్‌లో 1930 జనవరి 28న జన్మించారు.

తన తండ్రి పండిట్‌ మోతీరామ్‌ తన తొలి గురువు కావడంతో జస్రాజ్‌ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్‌లో గత 30 ఏళ్లుగా పండిట్‌ మోతీరామ్‌ సంగీత్‌ సమారోహ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ గాయని సాధనా సర్గమ్‌తో పాటు సంజీవ్‌ అభయంకర్‌, సుమన్‌ ఘోష్‌, తృప్తి ముఖర్జీ, కళా రామ్‌నాథ్‌ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్‌ ప్రకటించారు. కాగా, పండిట్‌ జస్రాజ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చదవండి : ప్రముఖ సీనియర్‌ గాయని మృతి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా