yaas cyclone: బురదలో చిక్కుకున్న వందమంది

26 May, 2021 20:39 IST|Sakshi

తుపాను బాధితులను కాపాడిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌

ముమ్మరంగా కొనసాగుతున్న సహాయ చర్యలు

కోల్‌కతా:యాస్‌ తుపానులో చిక్కకుని విలవిలాడుతున్న పశ్చిమబెంగాల్‌​, ఒడిషాలలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా తుపాను దాటికి బెంగాల్‌లోని సుందర్‌బన్‌ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లనే చుట్టేసింది. దీంతో బంకమట్టి నేలలు అధికంగా ఉండే సుందర్‌బన్‌లో అనేక మంది బురదలో కూరుకుపోయారు. నాయచార గ్రామంలో వంద మంది ‍ప్రజలు బురదలో చిక్కుకున్నట్టు సమాచారం రావడంతో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ స్పందించింది. హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించింది.

సహాయ చర్యలు

తుపాను తీవ్రతకు పశ్చిమ బెంగాల్‌లో  నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు కోటి ఇళ్లు ధ్వంసమైనట్టు బెంగాల్‌ సీఎం ప్రకటించారు. వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు ఒడిషాలోనూ పలు గ్రామాలను చుట్టుముట్టిన సముద్రపు నీరు నెమ్మదిగా వెనక్కి మళ్లుతోంది

మరిన్ని వార్తలు