మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్‌..!

17 Apr, 2021 08:56 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ : ముఖ్య ఆర్థిక సలహాదారు  కేవీ సుబ్రమణియన్‌  వ్యాఖ్యలు

కరోనా మొదటి వేవ్‌తో పోల్చితే  రెండో దశలో  మెరుగ్గా దేశ ఎకానమీ

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌-19 మొదటి వేవ్‌తో పోల్చితే ప్రస్తుత రెండవ దశలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ శుక్రవారం పేర్కొన్నారు.  ఇందుకు కారణాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఒకటని వివరించారు. మహమ్మారి  భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25- ఏప్రిల్‌ 14, ఏప్రిల్‌ 15- మే 3, మే 4–మే 17, మే 18మే 31) కఠిన లాక్‌డౌన్‌ అమలు జరిగింది. దీనితో ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం త్రైమాసికాల్లో ఎకానమీ క్షీణతలోకి జారింది. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకున్నాయి. మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. (దేశవ్యాప్త లాక్‌డౌన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు)

కరోనా సెకండ్‌వేవ్‌ ఆందోళనల నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
► 2020తో పోల్చితే ఇప్పుడు అనిశ్చితి వాతావరణం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అయితే సెకండ్‌ వేవ్‌ పట్ల ప్రజలు జాగరూకతతో వ్యవహరించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తత్సంబంధ అంశాలకు సంబంధించి కోవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.  
► కోవిడ్‌- నేపథ్యంలో డిజిటలైజేషన్, ఈ-కామర్స్‌లో పురోగతి నెలకొంది.  
► దాదాపు 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా నిత్యావసరాల సరఫరా జరిగింది.  జన్‌ధన్, ఆధార్, మెబైల్‌ (జేఏఎం) ద్వారా ‘ఒక్క బటన్‌ క్లిక్‌’తో నగదు బదలాయింపు జరిగింది. అమెరికాస హా పలు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌ ఈ విషయంలో ఎంతో ముందుంది.  
► ఈ-కామర్స్‌ రంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన వృద్ధిని అందిపుచ్చుకోడానికి భారత్‌ తగిన రీతిలో సిద్ధంగా ఉంది.
 

మరిన్ని వార్తలు