పరాక్రమంతో తిప్పికొట్టాం

15 Dec, 2020 06:28 IST|Sakshi

న్యూఢిల్లీ:  తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో  చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్‌ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు.

కవ్వింపులకు బదులిస్తాం:రావత్‌   
కోల్‌కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. చైనాకు చెందిన  పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టిబెట్‌లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు.

మరిన్ని వార్తలు