Respect To Queen Elizabeth II: సెప్టెంబర్‌ 11న సంతాపదినంగా ప్రకటించిన భారత్‌

9 Sep, 2022 18:44 IST|Sakshi

న్యూఢిల్లీ: క్వీన్‌ ఎలిజబెత్‌ 2 బ్రిటన్‌ రాణిగా సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఐతే ఆమె గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మేరకు వేసవి విడిది కోసం స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ కోటలో ఉన్న రాణి  గురువారం తుది శ్వాస విడిచారు. దీంతో రాచ కుటుంబికులు, యావత్తు యునైటైడ్‌ కింగ్‌డమ్‌ ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ దేశ ప్రజల ఆమె సుదీర్ఘపాలనను గుర్తు చేసుకోవడమే కాకుండా వారి ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి.

ఈ మేరకు భారత ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలం రాణిగా అత్యున్నత హోదాలో కొనసాగిన క్వీన్‌ ఎలిజబెత్‌2 గౌరవార్థం ఒక రోజు దేశం మొత్తం సంతాపదినంగా పాటించాలని శుక్రవారం నిర్ణయించింది. అందులో భాగంగానే సెప్టెంబర్‌ 11న సంతాప దినంగా పాటించాలని ప్రకటించింది. యావత్‌ భారతదేశం ఆరోజుని సంతాపదినంగా పాటించడమే కాకుండా భవనాలన్నింటిపై జాతీయ జెండ మాస్ట్‌లో ఎగురవేసి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ రోజుల ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవని పేర్కొంది. 

(చదవండి: బ్రిటన్‌ రాణి వాడిపడేసిన టీబ్యాగ్‌ ఎంతకు అమ్ముడుపోయిందంటే....)

మరిన్ని వార్తలు