సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే?

28 Jun, 2021 19:25 IST|Sakshi

కోల్‌కతా: ప్రేమకు హద్దులు, సరిహద్దులు అంటూ ఉండవు. ఎవ‌రినైనా.. ఎక్క‌డివారినైనా ప్రేమించొచ్చు. ప్రేమ పుట్టడమే అలస్యం.. ప్రేమించిన అమ్మాయి కోసం దేశాలు దాటి వెళ్లడానికి కూడా సిద్దం అవుతున్నారు కొందరు యువకులు. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కోసం అక్రమంగా దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోతున్నారు. ఇటువంటి సంఘటనే భారత్-బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద చోటుచేసుకుంది. ప‌శ్చిమ బెంగాల్ న‌దియా జిల్లాలోని బ‌ల్లావ్‌పూర్ గ్రామానికి చెందిన జైకాంతో చంద్ర‌రాయ్ (24)కు ఫేస్‌బుక్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన పరిణితి అనే అమ్మాయి ప‌రిచ‌యమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తరువాత ఓ బ్రోకర్ సాయంతో మార్చి 8న సరిహద్దు దాటి  బంగ్లాదేశ్ చేరుకున్నాడు.

జూన్‌ 10వ తేదీన ప్రేయసి పరిణితిని వివాహమాడాడు. ఆ త‌ర్వాత జూన్ 25వ తేదీ వ‌ర‌కు ఇద్దరూ క‌లిసి అక్క‌డే ఉన్నారు. జూన్‌ 26న చంద్ర‌రాయ్ తన భార్యతో కలిసి సొంతూరుకి బయలుదేరాడు. అయితే, బోర్డర్‌ దాటించేందుకు ఈ సారి కూడా రాజు మండల్‌ అనే బ్రోకర్‌ సాయం తీసుకున్నాడు. బోర్డర్‌ దాటించినందుకు అతడికి 10వేలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ జంట అక్రమంగా సరిహద్దు దాటుతున్న‌ట్టు బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌కు ప‌క్కా సమాచారం అందింది. వెంటనే ఆప్రమత్తమైన  బీఎస్ఎఫ్ బ‌ల‌గాలు ఆ జంటను అదుపులోకి తీసుకున్నాయి. బీఎస్ఎఫ్ విచారణలో అబ్బాయిది  ప‌శ్చిమ బెంగాల్, అమ్మాయిది బంగ్లాదేశ్ అని తెలింది. వీరిద్దరూ  వివాహం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో  వీరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వీరికి సరిహద్దు దాటేందకు సాయం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

చదవండి: సినిమా స్టోరీని తలపించే మోసాలు, ఆఖరికి తల్లిదండ్రులను కూడా


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు