దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధనౌక మోహరింపు

30 Aug, 2020 20:24 IST|Sakshi

దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యుద్ధ నౌకను మోహరించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం వద్ద తాము కీలక యుద్ధ నౌకను మోహరించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆదివారం ఓ జాతీయ వార్తాఛానెల్‌ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికన్‌ యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కి

ఇక వివాదాస్పద ప్రాంతంలో భారత యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత యుద్ధవిమానాల మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ప్రాబల్యం కలిగిన చైనా ఆ ప్రాంతంలో ఇతర దేశాల యుద్ధవిమానాల ఉనికిని వ్యతిరేకిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : చైనా దూకుడు: మిస్సైల్‌ బేస్‌ల నిర్మాణం!

మరిన్ని వార్తలు