మారిషస్‌ను మాల్దీవుల అనుకున్న నెటిజన్లు.. ‘ఎక్స్‌’ పోస్టులు వైరల్‌

21 Feb, 2024 19:33 IST|Sakshi

భారత్‌-మాల్లీవుల మధ్య దౌత్యపరమైన  వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్యదీప్‌ను పర్యటించిన ప్రధాని మోదీ.. అక్కడి అందాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా.. మాల్దీవుల మంత్రులు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. అప్పుడు భారత దేశంలోని ప్రముఖులంతా మాల్దీవుల కంటే.. స్వదేశానికి చెందిన లక్ష్యదీప్‌, అండమాన్‌ ద్వీపాలకు పర్యటనకు వెళ్లాలని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి విదితమే.

భారత్‌-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో  మారిషస్ ద్వీప దేశం భారతీయ పర్యటకులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ‘మరిషస్‌ టూరిజం(ఇండియా)’ ‘ఎక్స్’ (ట్విటర్‌)లో భారతీయ పర్యటకులు తమ దేశంలోకి రావాల్సిందిగా స్వాగంతం పలికింది.

‘మారిషస్‌లోని అందాలను అన్వేషించటం కోసం భారతీయులకు స్వాగతం. 2024 ఏడాదిలో మారిషస్‌ ద్వీపాన్ని సందర్శించండి. అక్కడి అందాలను చూసి కొత్త శక్తి, అనుభూతిని ఆస్వాధించండి. టన్నుల కొద్ది సాహసాలు, అనుభవాలు మీ కోసం ఎదురు చేస్తున్నాయి. ఈ రోజు మీ హాలీ ట్రిప్‌ను ప్లాన్‌ చేసుకోండి!’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, భారతీయ నెటజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. మారిషస్‌ ద్వీపాన్ని పలువురు భారతీయ నేటిజన్లు మాల్దీవులగా పొరపాటు పడ్డారు.

‘మాల్దీవులపై మాకు ఆసక్తి లేదు. మాకు లక్ష్యదీప్‌ ఉంది’, ‘ మీరు మా ప్రధానమంత్రిని అవమానించారు. అందుకే మేము మీ దేశాన్ని పర్యటించము’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో స్పందించిన మారిషస్‌ టూరిజం.. ‘హాయ్‌, ఇది మారిషస్‌ దేశం. మాల్దీవుల ద్వీపం కాదు. రెండు వేర్వేరు ద్వీపాలు’ అని స్పష్టత ఇచ్చింది. వెంటనే నెటిజన్లలో నవ్వులు పూచాయి. మరికొంత మంది నెటిజన్ల స్పందిస్తూ.. మాల్దీవుల కంటే మారిషస్‌ పర్యటన బాగుటుందని కామెంట్లు చేశారు. ‘ మాల్దీవుల కంటే స్నేపూర్వకంగా ఉండే మారిషస్‌ పర్యటనకు వెళ్లటం ఉత్తమం’, మాల్దీవుల కంటే మారిషస్‌ చాలా చాలా మంచి పర్యటక ప్రాంతం’ అని కామెంట్లు చేశారు. ప్రస్తుతం  ఈ పోస్టులు ‘ఎక్స్‌’ వైరల్‌ అవుతున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు