75 ఏళ్ల స్వాతంత్రమే కాదు.. మరో మైలు రాయి కూడా! అర్ధశతాబ్దపు ‘పిన్‌’ గురించి ఈ విషయాలు తెలుసా?

15 Aug, 2022 11:35 IST|Sakshi

స్పెషల్‌: స్వతంత్ర భారతావని 75 ఏళ్ల వసంతం పూర్తి చేసుకుంది. దేశం మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇవాళ మన దేశం మరో మైలురాయిని దాటిందన్న విషయం మీకు తెలుసా?.. అదీ తపాలా వ్యవస్థ ద్వారా!.

పోస్టల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌(PIN)కు సరిగ్గా ఇవాళ్టికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. లెటర్లు, కొరియర్లు, ఇతర పోస్టల్‌ ఐటెమ్స్‌ పంపడానికి ఈ నెంబర్‌ తప్పనిసరి అనే విషయం తెలిసిందే కదా. ఈ పిన్‌ను 1972, ఆగస్టు 15న మొదలుపెట్టారు. ఇంతకీ ఇది ఎలా పుట్టింది? ఇది రావడానికి ఎవరి కృషి దాగుంది? తదితర విషయాలు చూద్దాం.

Postal Identification Number నే ఏరియా కోడ్‌ లేదంటే జిప్‌ కోడ్‌ అని కూడా పిలుస్తారు. ఈ నెంబర్‌​ వల్లే పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌కు, పోస్ట్‌మ్యాన్‌కు ఉత్తరాలు సరఫరా చేయడం సులభం అవుతోంది. 

పిన్‌ కోసం కృషి చేసిన వ్యక్తి.. శ్రీరామ్‌ భికాజి వెలెంకర్‌. ఫాదర్‌ ఆఫ్‌ పిన్‌గా ఈయనకు పేరు ముద్రపడిపోయింది. మహారాష్ట్రకు చెందిన ఈయన కేంద్ర సమాచార శాఖలో అదనపు కార్యదర్శిగా, పోస్టల్‌ అండ్‌ టెలిగ్రాఫ్‌బోర్డులో సీనియర్‌ సభ్యుడిగా కొనసాగారు. సంస్కృత కవి అయిన వెలెంకర్‌కు 1996లో రాష్ట్రపతి అవార్డు దక్కింది. 1999లో ఆయన కన్నుమూశారు. 

► భారతదేశం అంతటా అనేక స్థలాల పేర్లను నకిలీ చేయడం వలన పిన్ కోడ్ అవసరం ఏర్పడింది. ప్రజలు వివిధ భాషలలో చిరునామాలను కూడా వ్రాసేవారు, ఇది చిరునామాలను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అందుకే కోడ్ సిస్టమ్ వల్ల.. పోస్ట్‌మెన్ చిరునామాను సరైన వ్యక్తులకు అందించడంలో సహాయపడింది.

► ఆరు నెంబర్ల పిన్‌ కోడ్‌లో.. ఫస్ట్‌ డిజిట్‌ జోన్‌ను సూచిస్తుంది. 

► రెండవది.. సబ్‌ జోన్‌ను సూచిస్తుంది. 

► మూడవది.. జిల్లాను అదీ సదరు జోన్‌ పరిధిలోనే ఉందని తెలియజేస్తుంది. 

► చివరి మూడు డిజిట్స్‌​ మాత్రం.. సంబంధిత పోస్టాఫీస్‌ను తెలియజేస్తుంది. 

► పోస్టల్‌ రీజియన్‌ కార్యాలయం.. ప్రధాన పోస్టాఫీస్‌కు ప్రధాన కేంద్రం లాంటిది. 

► భారతదేశంలో ఎనిమిది ప్రాంతీయ మండలాలు, ఒక ఫంక్షనల్ జోన్ (భారత సైన్యం కోసం) సహా తొమ్మిది పోస్టల్ జోన్‌లు ఉన్నాయి.

► ఇండియా పోస్ట్‌ ప్రకారం.. దేశం మొత్తం 23 పోస్టల్‌ సర్కిల్స్‌గా విభజించబడి ఉంది. ప్రతీ సర్కిల్‌కు  హెడ్‌గా చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఉంటాడు.

► PIN prefix లిస్ట్‌లో.. 50 అనే సంఖ్య టీజీ అనేది తెలంగాణను, 51-53 మధ్య ఏపీని సూచిస్తుంది. 

► డెలివరీ కార్యాలయం జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO), ప్రధాన కార్యాలయం (HO) లేదా సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే సబ్-ఆఫీస్ (SO) కావచ్చు.

► సాధారణంగా చాలామంది ఆశువుగా పిన్‌ నెంబర్‌ అనేస్తుంటారు. కానీ, పోస్టల్‌ విషయంలో  పిన్‌ నెంబర్‌ అని రాయకూడదు.. పోస్టల్‌ ఇండెక్స్‌ నెంబర్‌ లేందటే పిన్‌ అని మాత్రమే రాయాలి.

ఇదీ చదవండి: ‘ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’

మరిన్ని వార్తలు