ఫ్యాక్ట్ చెక్: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి సాధార‌ణ రైళ్లు

24 Jan, 2021 16:16 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే అన్ని సాధారణ పాసెంజర్ రైళ్లను ఆపివేసిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే భారతీయ రైల్వే నడుపుతోంది. ఇదిలావుండగా, 2021 ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్లు, లోకల్ రైళ్లు, స్పెషల్ రైళ్లు పనిచేయబోతున్నాయని ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై పీఐబీ ఫాక్ట్ చెక్ స్పందించింది.(చదవండి: ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్‌లోడ్‌)

ఈ సందేశం పూర్తిగా అబద్ధమని భారతీయ రైల్వే అటువంటి ప్రకటన చేయలేదని రైల్వే అధికారులతో పాటు పీఐబీ(ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో) ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులను ప‌రిశీలిస్తున్నామ‌ని ప్ర‌భుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖ‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే సాధార‌ణ రైళ్ల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రైల్వే అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక రైళ్ల‌ను మాత్ర‌మే న‌డుపుతోంది. ప్రస్తుతం రైల్వే మొత్తం మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 65 శాతం రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు