మొతేరాకు మోదీ పేరు, పప్పులో కాలేసిన భారత‌ నెటిజన్లు

27 Feb, 2021 14:03 IST|Sakshi

బ్రిటన్‌ రచయిత టామ్‌ హోలాండ్‌ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ భారత నెటిజన్లు స్పైడర్‌ మ్యాన్‌ నటుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి రచయిత చేసిన కామెంట్స్‌కు నటుడిపై ఎందుకు మండిపడుతున్నారని ఆశ్చర్యపోతున్నారా!. ఇక్కడే కొందరు మన ఇండియన్‌ నెటిజన్లు పప్పులో కాలేశారు. ఆవేశంలో ఎవరో కూడా చూసుకోకుండా స్పైడర్‌ మ్యాన్‌ నటుడు టామ్‌ హోలాండ్‌పై ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. అసలేం జరిగిందంటే..

ఇంగ్లాండ్‌ రచయిత టామ్‌ హోలాండ్‌ ‘ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్‌ స్టేడియానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పేరును పెట్టించుకోవాలని తహతహలాడారు. ఓ నాయకుడు అలా చేయడం శుభపరిణామం కాదు’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీంతో మోదీ అభిమానులు టామ్ హోలాండ్‌పై విరుచుకుపడటం ప్రారంభించారు. అయితే స్పైడర్‌ మ్యాన్‌ నటుడు టామ్‌, రచయిత టామ్‌ పేర్లు ఒకేలా ఉండటంతో నెటిజన్లు కన్‌ఫ్యూజ్‌‌ అయ్యారు.

ఈ ట్వీట్‌ చేసింది స్పైడర్‌ మ్యాన్‌ నటుడు టామ్‌ యే అనుకొని అతడిని టార్గెట్‌ చేసి ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. అంతేగాక ‘బాయ్‌కాట్‌ స్పైడర్ మ్యాన్’ పేరిట హ్యాష్ ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. అయితే దీనిపై నటుడు టామ్‌ హోలాండ్‌ ఇంతవరకూ స్పందించలేదు. కానీ రచయిత టామ్‌ మాత్రం ‘స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హోలాండ్‌‌ను ఇండియా ఎందుకు నిషేధించాలని భావిస్తున్నదంటే...’ అంటూ మరో ట్వీట్‌ చేసి భారత నెటిజన్లకు స్పష్టత ఇచ్చాడు.

దీంతో నెటజన్లంత తమ తప్పిదానికి నాలుక కరుచుకున్నారు. కాగా అహ్మదాబాద్‌ మొతేరాలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్‌ క్రికెట్ స్టేడియాన్ని ఇటీవల గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌ నిర్మించింది. ఈ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ పేరును పెట్టడం వివాదాస్పదమైంది.

చదవండి: నరేంద్ర మోదీ స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
14 గంటలు యముడితో పోరాడాడు!
వైరల్‌ : 11 ఏళ్లపాటు సేవలు.. జాగిలానికి ఘనంగా వీడ్కోలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు