ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!

29 Nov, 2023 19:38 IST|Sakshi

జైపూర్‌: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్‌కు వెళ్లింది. 

అంజూ రాజస్థాన్‌ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. 

జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్‌లో టచ్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు.  

ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన


 

మరిన్ని వార్తలు