చరిత్ర సృష్టించనున్న మిథాలీ సేన..

20 May, 2021 15:42 IST|Sakshi

ముంబై:  భారత మహిళా క్రికెట్ లో మరో ఘట్టానికి తెర లేవనుంది. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకు వేళ్లేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్​ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి  అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ జరగునుంది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ట్విట్టర్‌ ద్వారా  తెలిపారు. 

అయితే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పింక్‌బాల్ టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్​లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. 

(చదవండి:ఇంగ్లండ్‌ వేదికగా ఐపీఎల్‌ ?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు