మొట్ట‌మొద‌టి మ‌హిళా కార్డియాల‌జిస్ట్ మృతి

31 Aug, 2020 12:12 IST|Sakshi

ఢిల్లీ : భార‌త మొట్టమొద‌టి మ‌హిళా కార్డియాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎస్ ప‌ద్మావ‌తి (103) క‌న్నుమూశారు. క‌రోనా కార‌ణంగా ఆరోగ్యం విష‌మించి తుదిశ్వాస విడిచిన‌ట్లు వైద్యులు తెలిపారు. వైద్య‌రంగంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లున్న ప‌ద్మావ‌తి గ‌త 11 రోజుల క్రితం నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. 1981లో ఆమె స్థాపించిన ఆస్పత్రిలోనే క‌న్నుమూయ‌డంతో అక్క‌డ విషాద చాయ‌లు అలుముకున్నాయి. వ‌య‌సుమీద ప‌డ‌టం, క‌రోనా వ‌ల్ల  ఆమె ఆరోగ్యం మ‌రింత క్షీణించి మ‌రణించినట్లు ఆసుప‌త్రి సీఈవో డాక్టర్‌ ఓపీ యాదవ్ వెల్ల‌డించారు. గాడ్‌మదర్‌ ఆఫ్‌ కార్డియాలజీగా ప‌ద్మావ‌తి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. ఆమె చేసిన సేవ‌ల‌కు గుర్తుగా భార‌త ప్ర‌భుత్వం 1967తో  ప‌ద్మ భూష‌ణ్, 1992లో ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుల‌తో స‌త్క‌రించింది. డాక్టర్‌ ప‌ద్మావ‌తి మ‌ర‌ణంపై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం, వైద్య నిపుణులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. మొట్ట‌మొద‌టి మ‌హిళా కార్డియాల‌జిస్ట్‌గా ప‌ద్మావ‌తి సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అని గుర్తుచేసుకున్నారు. (ఎయిమ్స్‌ నుంచి అమిత్‌ షా డిశ్చార్జ్‌)

మరిన్ని వార్తలు