దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్‌! త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌

17 Jan, 2022 20:02 IST|Sakshi

డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ని కట్టడి చేసేలా మరో సరికొత్త ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సిన్‌ రానుంది. ఈవ్యాక్సిన్‌ను పూణేకు చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్‌ సమర్థతకు సంబంధించిన క్లినికల్‌ ట్రయిల్స్‌ వచ్చే నెలలో (ఫిబ్రవరి)లో ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు.


ఈ మేరకు జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఫేజ్‌-2 పరిశోధన డేటాను సమర్పించింది. అంతేగాక తదుపరి ఫేజ్‌-3కి  సంబంధించిన డేటాను కూడా  సిద్ధం చేసింది. పైగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఇసీ) త్వరలో ఈ డేటాలను సమీక్షించనుందని అధికారులు వెల్లడించారు. 

మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ ఏంటంటే..
అభివృద్ధి చేసిన భారత్‌ ఆధారిత  తొలి ఎంఆర్‌ఎన్‌ఏ కోవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించిన ఫేజ్‌-2, ఫేజ్‌-3 పరిశోధనలను డీసీజీఐ ఇంతకుముందే ఆమోదించిందని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వెల్లడించింది. కాగా ఈ వ్యాక్సిన్‌ పేరు ‘HGCO19’ అని పేర్కొంది. జెనోవా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఫేజ్‌-1కి సంబంధించిన పరిశోధనలను భారత నేషనల్‌ రెగ్యూలేటరీ అథారిటికి సంబంధించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ)కి సమర్పించినట్లు కూడా పేర్కొంది.

అయితే ఫేజ్‌I పరిశోధనలను సమీక్షించిన నిపుణులు ఈ వ్యాక్సిన్‌​ HGCO19 సురక్షితమైన ఇమ్యునోజెనిక్‌గా గుర్తించినట్లు కంపెనీ మీడియాకి తెలిపింది. ఈ వ్యాక్సిన్‌లు న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్‌ల వర్గానికి చెందినవి, ఇవి వ్యాధిని కలిగించే వైరస్‌లు లేదా వ్యాధికారక క్రిముల నుండి వచ్చే జన్యు పదార్థాన్ని ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపింది. అయితే తదుపరి రెండు దశలకు సంబంధించిన క్లినికల్‌ ట్రియిల్స్‌ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు