Nasal Vaccine: భారత్‌ బయోటెక్‌ నాసల్‌ కోవిడ్‌ టీకాకు డీసీజీఐ అనుమతి

6 Sep, 2022 16:03 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ బయోటెక్‌ సం‍స్థ రూపొందించిన నాసల్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ​అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమితిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ తెలిపారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది పెద్ద ప్రోత్సాహమని డాక్టర్ మాండవ్య అన్నారు.

18 ఏళ్లు దాటిని వారికి నాజల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని తెలిపారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ఇది పెద్ద ప్రోత్సాహం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు కాగా భారత్‌లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది.  ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్న విష‌యం తెలిసిందే.
చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్‌.. కరెంట్‌ స్తంభం పట్టుకోవడంతో

మరిన్ని వార్తలు