దూసుకొస్తున్న ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు

25 Sep, 2020 20:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ-ఘజియాబాద్‌-మీరట్‌ ప్రాంతీయ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) రైలు తొలి డిజైన్‌ను పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ శుక్రవారం విడుదల చేసింది. 82 కిలోమీటర్ల పొడవున గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లతో ఆర్‌ఆర్‌టీఎస్‌ క్యారిడార్‌ దేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. జాతీయ రాజధాని ప్రాంతం వెంట ఆర్‌ఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును అమలుచేసేందుకు ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్‌, యూపీ ప్రభుత్వాలు కలిసి ఎన్‌సీఆర్‌టీసీ పేరిట జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేశాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందే ఆర్‌ఆర్‌టీఎస్‌ రైళ్లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మాణమై తేలికపాటి బరువును కలిగిఉంటాయి. ఈ రైళ్లు పూర్తిగా ఏసీ సౌకర్యాన్ని కలిగిఉంటాయి. చదవండి : యాదాద్రికి  ఎంఎంటీఎస్‌ ఏదీ?

మరిన్ని వార్తలు