IndiGo Plane: విమానం టేకాఫ్‌ సమయంలో అపశ్రుతి... చక్రం బురదలో కూరుకుపోయి..

29 Jul, 2022 11:55 IST|Sakshi

గౌహతి: ఇటీవల విమానాల్లో ఏదో సాంకేతిక సమస్య తలెత్తడం అప్పటికప్పుడూ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడం జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవల మొత్తం మూడు చోసుకున్నాయి. ఇప్పుడూ మళ్లీ ఇండిగో విమానం కూడా అదే బాటపట్టింది. ఈ మేరకు ఇండిగో విమానం అస్సాంలోని జోర్హాట్‌ నుంచి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్‌ సమయంలో అపశ్రుతి చోటుచ చేసుకుంది.

రన్‌వే నుంచి జారి పక్కనున్న గడ్డితో కూడిన నేలపైకి దూసుకొచ్చింది. ఆ విమానం చక్రాలు బురదలో ఇరుక్కుపోయాయి. దీంతో మధ్యాహ్నాం 2.30 గంటల కల్లా బయల్దేరాల్సిన విమానం కాస్త ఆలస్యంగా బయల్దేరింది. ఈ విమానంలో సుమారు 98 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఈ ఘటన తాలుకా పోటోలు ట్విట్టర్‌వలో వైరల్‌ అవుతున్నాయి. 

(చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్‌ విధింపు)

మరిన్ని వార్తలు