Indigo CEO: ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో

9 May, 2022 16:34 IST|Sakshi

CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది  నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్‌ వీల్‌ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు.

ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్‌ మాధ్యమాల్లో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

(చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్‌)

మరిన్ని వార్తలు