Heavy Rains-Delhi Airport: చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం

11 Sep, 2021 15:08 IST|Sakshi

భారీ వర్షంతో నీట మునిగిన ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌

పలు విమానాలు దారి మళ్లింపు.. కొన్ని రద్దు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిరాటంకంగా శనివారం భారీ వర్షం పడడంతో రోడ్లతో పాటు విమానాశ్రయం కూడా జలమయమైంది. ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతమంతా నీటిలో మునిగింది. విమానాలు ఆగే ప్రాంతం.. ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు నీటితో నిండాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దవగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఒక అంతర్జాతీయ, ఒక దేశీయ విమానం జైపూర్‌, అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు ఇండిగో విమానాలు రద్దయ్యాయి.
చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్‌

‘అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కొద్దీ సమయంలోనే నీళ్లు చేరాయి. మా బృందం వెంటనే చర్యలు చేపట్టింది’ అని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాన్ని ఎప్పటికప్పుడు నీరు బయటకు పంపించేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలవగా ఈ ఏడాది వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 40 ఏళ్లల్లోనే అత్యధిక వర్షాలు 2021లో నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
 

>
మరిన్ని వార్తలు