అయోధ్యలో మసీదు..

20 Dec, 2020 03:47 IST|Sakshi

లక్నో: వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల  చేసింది. గత యేడాది సుప్రీంకోర్టు అయోధ్యలో రామాలయం, మసీదులను విడివిడిగా నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు ప్రాజెక్టు తొలిదశలో భాగంగా వచ్చే యేడాది ప్రారంభంలో పునాది రాయి వేయవచ్చునని భావిస్తున్నారు. మసీదుతో పాటు ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టి, రెండో దశలో ఆ ఆసుపత్రిని మరింత విస్తరించాలని ట్రస్టు భావిస్తోంది. ఈ మసీదుకి ఇంకా పేరు నిర్ణయించలేదని, చక్రవర్తిగానీ, రాజు పేరుమీదగానీ మసీదు ఉండబోదని ఇండో ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌) ట్రస్ట్‌ పేర్కొంది. ఈ ట్రస్ట్‌ ప్రపంచంలోని అనేక మసీదుల డిజైన్లను పరిగణనలోనికి తీసుకొని అయోధ్యలో మసీదు, దానిపక్కనే ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ని విడుదల చేసింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు