రీల్స్‌ చేసే భర్త కావాలి.. కెమెరా ముందు సిగ్గుండకూడదు.. వైరలవుతున్న యువతి పెళ్లి ప్రకటన

29 Oct, 2023 17:40 IST|Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఏడడుగులు వేసి ఒక్కటవుతున్నారు. పెళ్లి అంటే ఎన్నో పనులు ఉంటాయి. ఇందులో ముందుగా వరుడు, వధువును ఎంపిక చేసుకోవడం పెద్ద టాస్క్‌. ప్రేమ పెళ్లిలో ఈ ఇబ్బంది ఉండదు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహంలో అబ్బాయి లేదా అమ్మాయిని సెలెక్ట్‌ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

ఒకప్పుడు బంధువులు, పెళ్లిళ్ల పేరయ్యలు, తెలిసిన వాళ్లు సంబంధాలు తెచ్చేవారు కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. చ్చిన అమ్మాయి, అబ్బాయి కావాలని పేపర్‌, మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో ప్రకటనలు ఇచ్చే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఓ యువతి తనకు కావాల్సిన వరుడి విషయంలో కొంచెం కొంచెం వింత‌ నిబంధనలు పెట్టింది. ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌గా చేసే ఒక అమ్మాయి పెళ్లి కోసం ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌ అయిన రియా అనే యువతి వరుడు కావలెను అంటూ యాడ్ ప్రచురణ ఇచ్చింది. ఇందులో తనకు సరిపోయే రీల్ భాగస్వామి + పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.. అతనికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదని, తనలో కలిసి క‌పుల్/రిలేషన్ రీల్స్ చేయాలని పేర్కొంది. కొత్త ఆలోచ‌న‌లు MOI MOI లాంటి ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్‌కు ఆలోచనలు ఇవ్వాలని, అత‌డు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండకూడదని చెప్పింది

తనను క‌లుసుకునే ముందు.. అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్‌డ్  చూసి నాకు ఎలాంటి అబ్బాయి న‌చ్చుతాడో తెలుసుకోవాలని పేర్కొంది. అత‌డికి నా రీల్స్ / వ్లాగ్స్ ఎడిట్ చేయ‌డానికి ప్రీమియ‌ర్ ప్రో వ‌చ్చి ఉండాలి అని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది.

మరిన్ని వార్తలు