ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రూ.100 కోట్ల సాయం 

11 May, 2021 03:46 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: దేశంలో కోవిడ్‌ నియంత్రణ కోసం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ రూ.100 కోట్లు విరా ళాన్ని ప్రకటించింది. గత ఏడాది కరోనా సమయంలో రూ.100 కోట్లు సాయం చేశాం, ఇప్పుడు మరో రూ.100 కోట్ల సహాయం చేస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి సోమవారం తెలిపారు. ఆసుపత్రులకు వెంటిలేటర్లు, ఆక్సిజన్, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు తదితర వసతుల కోసం ఈ మొత్తం ఇస్తున్నట్లు చెప్పారు. వాహన డ్రైవర్లకు, కార్మికులకు నిత్యావసరాలను అందజేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు