మిసైల్‌ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జల ప్రవేశం

18 Dec, 2022 12:48 IST|Sakshi

ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్‌ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఐఎన్‌ఎస్‌ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌, గోవా గవర్నర్‌ పీఎస్‌ శ్రీధరన్‌ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్‌ షిప్‌ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్‌, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌. 

మర్ముగోవా విశేషాలు..
ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ విధ్వంసక నౌక.

► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్‌షిప్‌కు పెట్టారు.

► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. 

భారత నౌకాదళ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్‌ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. 

ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్‌ పోటాపోటీ 

మరిన్ని వార్తలు