ఎగ్జామ్‌ సెంటర్‌కు ఎమ్మెల్యే వస్తున్నాడని హడావుడి.. తీరా ఆయన చూస్తే..

31 Jul, 2021 14:37 IST|Sakshi

సాక్షి, గంజాం: కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెట్రిక్‌ ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఫలితాల పట్ల ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారికి మరోసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాసి, మంచి మార్కులు సాధించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో గంజాం జిల్లాలో శుక్రవారం మెట్రిక్‌ పరీక్షలు (టెన్త్‌ ఎగ్జామ్స్‌) ప్రారంభమయ్యాయి. 

కాగా తొలిరోజు పరీక్షకు సురడా నియోజకవర్గానికి చెందిన బీజేడీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వంయి హాజరు కావడం సంచలనం రేకెత్తించింది. బంజనగర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి ఉదయం చేరిన ఈయనను చూసి, అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే సందర్శనకు వస్తున్నారని అంతా హడావిడి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చారని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు