సైన్యంలో విద్రోహులు! 

20 Apr, 2022 09:17 IST|Sakshi

శత్రు దేశపు వలలో అధికారులు? 

మన రక్షణ గుట్టుమట్ల చేరవేత 

సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘన 

న్యూఢ్లిల్లీ: సైన్యంలో అతి పెద్ద సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనల్ని ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు గుర్తించాయి. కొందరు మిలటరీ అధికారులకు శత్రు దేశంతో అనుమానాస్పద సంబంధాలున్నట్టు వెల్లడైందని వెల్లడించాయి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా వారు సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలకు పాల్పడినట్టు తేలిందని చెప్పాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టుగా తెలిపాయి.

‘‘వారికి పొరుగు దేశంతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తాం’’ అని నిఘా అధికారులు తెలిపారు. దీనిపై ఊహాగానాలు చేయొద్దని మీడియాను కోరారు. పాక్, చైనా గూఢచారులు మన దేశ భద్రతకు సంబంధించిన సమాచారం రాబట్టడానికి సైనికాధికారులపై వల పన్నుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు వారి గాలానికి చిక్కినట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వివరించాయి.   

చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం)

మరిన్ని వార్తలు