థాంక్యూ తారా: రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!

16 Aug, 2021 20:58 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ గీతం వింటే చాలు భారతీయుల గుండెలు ఉద్వేగంతో ఉప్పొంగిపోతాయి. త్రివర్ణ పతాకానికి వందనం చేస్తూ జనగణమన ఆలాపిస్తున్న సమయంలో భక్తి భావంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పంద్రాగష్టు పండుగ సందర్భంగా ఆదివారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడిన వేళ ఇలాంటి సన్నివేశాలు అనేకం చోటుచేసుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ సహా పలు కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో భారత అటవీ శాఖ అధికారి సుధా రామెన్‌ ట్విటర్‌లో పంచుకున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు చెందిన తారా ఘహ్రెమని అనే యువతి గతంలో భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సంతూర్‌పై భారత జాతీయ గీతం జనగణమనను వాయించింది. అయితే, ఈ పాత వీడియోను వెలికితీసిన రామెన్‌ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా షేర్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘ఎంతో హృద్యంగా ఉంది. గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఇంతబాగా ప్లే చేసినందుకు థాంక్స్‌ తారా’’ అంటూ సదరు యువతికి నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు