భారత్‌పై ఐసిస్‌ కుట్ర బట్టబయలు

20 Oct, 2020 14:47 IST|Sakshi

ఓ వర్గాన్ని రెచ్చగొడుతున్న ఐసిస్‌

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర సంస్థ ఐసిస్‌ కుట్రపూరిత ప్రణాళిక మరోసారి బట్టబయలైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేబూని జీహాద్‌ చేపట్టాలని ఐసిస్‌ తన డిజిటల్‌ మ్యాగజైన్‌లో ఓ వర్గాన్ని రెచ్చగొడుతోందని ఓ జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది. జాతి భద్రతకు ముప్పుగా ముంచుకొచ్చిన మ్యాగజైన్‌పై భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని పిలుపు ఇచ్చిన ఐసిస్‌ డిజిటల్‌ మ్యాగజైన్‌ ఈ పోరాటానికి మద్దతుగా తాము నిలబడతామని హామీ ఇచ్చింది.

రహస్య టెలిగ్రాం చానెల్స్‌, వెబ్‌ మీడియా ద్వారా ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పేరిట ఐసిస్‌ డిజటల్‌ మ్యాగజైన్‌ దేశ ప్రజల్లో విద్వేష భావాన్ని నూరిపోస్తోందని ఆ కథనం పేర్కొంది. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ వర్గాన్ని ఈ మ్యాగజైన్‌ రెచ్చగొడుతోందని స్పష్టం చేసింది. సీఏఏపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ కోర్టుల నిర్ణయాలకు కట్టబడిఉండరాదని ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని పేర్కొంది. చదవండి : ఐసిస్‌ అడ్డాగా ఐటీ రాజధాని..!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు