Israel-Hamas war: ఓటింగ్‌కు దూరం సరికాదు

31 Oct, 2023 06:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరుపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్‌ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. ‘‘హమాస్‌ దాడులను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. కానీ ప్రతీకారం పేరుతో నిస్సహాయులైన ప్రజలపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులు వినాశనానికే దారి తీస్తున్నాయి.

పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా శాంతియుతంగా సహజీవనం చేసేలా నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరగాలన్నదే ఈ సమస్యపై కాంగ్రెస్‌ వైఖరి అని సోనియా గుర్తు చేశారు. సోమవారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. గాజాను అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్‌ చెరబట్టిన తీరు ఆ ప్రాంతాన్ని ఓపెన్‌ జైలుగా మార్చేసిందని ఆవేదన వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు