ఇస్రో, హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ, బెంగళూరులో జేటీఓ పోస్టులు

5 Nov, 2021 13:44 IST|Sakshi

బెంగళూరులోని ఇస్రో–హ్యూమన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ప్లయిట్‌ సెంటర్‌(హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ (జేటీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 06

► అర్హత: హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. హిందీ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ నుంచి హిందీకి ట్రాన్స్‌లేట్‌ చే యడం వచ్చి ఉండాలి.

► వయసు: 20.11.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్‌–ఏ ఆబ్జెక్టివ్, పార్ట్‌–బి డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాతపరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల్ని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.11.2021

► వెబ్‌సైట్‌: www.isro.gov.in

మరిన్ని వార్తలు