గూగుల్ మ్యాప్స్‌కు దీటుగా ఇస్రో మ్యాప్స్

14 Feb, 2021 16:58 IST|Sakshi

భారత్‌లో ప్రస్తుతం విదేశీ యాప్‌లకు ప్రత్నామ్నాయంగా చాలా స్వదేశీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్‌కు ప్రత్నామ్నాయంగా ‘కూ‘ యాప్ పై పెద్ద చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక వాట్సాప్‌కు పోటీగా ‘సందేశ్‘ పేరుతో ప్రభుత్వమే ఒక యాప్ రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మ్యాప్స్ సేవల్లో అగ్రస్థానంలో ఉన్న గూగుల్ మ్యాప్స్ కు ప్రత్నామ్నాయంగా మరో యాప్ రాబోతున్నట్లు తెలుస్తుంది. దీని కోసం మన దేశానికి చెందిన భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో), మ్యాప్ మై ఇండియా చేతులు కలిపాయి. 

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్ కు దీటుగా సేవలు అందించడమే తమ తక్షణ కర్తవ్యం అని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సిఇ ఇన్ఫో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌(డీవోఎస్‌) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో ధృవీకరించింది. ఈ సందర్భంగా మ్యాప్‌ మై ఇండియా సీఈఓ రోహణ్‌ వర్మ మాట్లాడుతూ.." స్వదేశీ నావిగేషన్ సేవల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయి అని తెలిపారు. మ్యాప్ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన స్వదేశీ కంపెనీ. ఈ సంస్థ దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందిస్తుందన్నారు. మీకు ఇకపై గూగుల్ మ్యాప్స్/ గూగుల్ ఎర్త్ అవసరం లేదు" అని అన్నారు. మ్యాప్ మై ఇండియా వినియోగదారులు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాపులను చూడవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం తమకు తప్పనిసరి అవసరమని ఇస్రో తెలిపింది.

చదవండి:

ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్

ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు