ఇస్రో జైత్రయాత్ర: పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం

26 Nov, 2022 12:38 IST|Sakshi

సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్‌ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.

సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్‌ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్‌ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్‌, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్‌ బోల్ట్‌ షాటిలైట్స్‌తో పాటు..  17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్‌ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. 

ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం
పీఎస్‌ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్‌ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

చదవండి: (క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌ రాజ్యాంగం: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు