చంద్రయాన్‌–3 నుంచి చంద్రుడి వీడియో.. నీలి ఆకుపచ్చ రంగులో మూన్‌

7 Aug, 2023 09:11 IST|Sakshi

బెంగళూరు: చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్‌–3 మిషన్‌ ఆదివారం చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది.

చంద్రయాన్‌–3 మిషన్‌ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా చందమామపై ఉన్న లోతైన బిలాలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రుడికి సంబంధించి చంద్రయాన్‌–3 పంపించిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. 

మరిన్ని వార్తలు