వైరల్‌: ఆకా లేదంటే పురుగా.. ఆశ్చర్యంగా ఉందే!

26 Aug, 2021 16:41 IST|Sakshi

‘అరె చూడటానికి అచ్చం ఆకులా ఉందే.. నిజంగా ఆకేనా.. లేదంటే పురుగా’ అని పై ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారా. ఇలాంటి సందేహం కలగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆకృతిలో ఆకును తలపిస్తూ విచిత్రంగా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ పురుగు. ఫిలియం జిగాంటియం అని పిలువబడే ఈ జీవి శరీరం అచ్చం ఆకులా కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు. దీనికి ఉండే రెండు కాళ్లతో ఆకులాగే కనిపిస్తుంది. చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తాజాగా కొన్ని ఆకు పురుగులు కదులుతున్న వీడియోను సైన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ షేర్‌ చేసింది.

దీంతో ఈ ఆకు పురుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కానీ, చ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి మిలియన్ వ్యూస్ రాగా లక్షల్లో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి ఇక.
చదవండి: కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి!

A post shared by Science by Guff 🧬 (@science)

మరిన్ని వార్తలు