IT Raids: వామ్మో!...పైప్‌లైన్లో నోట్ల కట్టలు..!!

24 Nov, 2021 18:46 IST|Sakshi

 మనం సినిమాల్లో బ్లాక్‌మనీని కారు టైర్లలోనూ, గోడల్లోనూ దాచడం చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అలా దాచేవాళ్లను చూడటం చాలా అరుదు. మహా అయితే పలానా అధికారి ఇంట్లో ఇంత సోమ్ము స్వాధీనం చేసుకున్నాం అని విని ఉంటాం తప్ప ఎలాంటి చోట్ల వాళ్లు దాచుతారో చూసి ఉండం. కానీ కర్ణాటకలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్‌ అవినీతి సోమ్మును ఎక్కడా దాచాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే.!
బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డెవలప్‌మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన ఇంజనీర్ నివాసంలో  తాము ఒక ప్లంబర్‌​ సాయంతో పైప్‌లైన్‌ల నుంచి కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు.

(చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది)

పైగా తమకు పైపులైన్‌లో నగదు దాచినట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ. 25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు దాదాపు 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించన సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంపై కూడా అవినీతి నిరోధక శాఖ దాడులు నిర‍్వహించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. అవినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు.

(చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!)

మరిన్ని వార్తలు