బస్సు బ్రేకులు ఫెయిలై ఘోర ప్రమాదం.. ఐటీబీపీ సిబ్బంది దుర్మరణం

16 Aug, 2022 12:51 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమర్‌నాథ్‌ యాత్ర భద్రత కోసం వెళ్తున్న ఐటీబీపీ సిబ్బందితో కూడిన బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది.  పహాల్గాం వద్ద బస్సు నదీలోయలో పడిపోయింది బస్సు. ఈ ప్రమాదంలో ఆరుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. 

అమర్‌నాథ్‌ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ సిబ్బందితో కూడిన బస్సు చందన్‌వారీ నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ఫ్రిస్‌లాన్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు.

ఆ సమయంలో బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది,  ఇద్దరు జమ్ము పోలీసులు సైతం ఉన్నారు. గాయపడిన సిబ్బందని శ్రీనగర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు