ఊపిరి పీల్చుకున్న సిగరెట్ కంపెనీలు

1 Feb, 2021 17:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021 కేంద్ర బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తుల మీద పన్నుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడంతో అతిపెద్ద సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ షేర్లు 6.5 శాతానికి పైగా పెరిగాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఇతర సిగరెట్ తయారీ సంస్థల షేర్ ధరలు కూడా పెరిగాయి. విఎస్‌టి ఇండస్ట్రీస్, గోల్డెన్ టొబాకో, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ వంటి కంపెనీల షేర్లు కూడా 2.06 శాతం, 7.94 శాతం, 0.83 శాతం పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం ఆదాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున బడ్జెట్ కు ముందు పొగాకు, మద్యం వంటి వాటిపై పన్ను పెంపు ఉంటుందని అందరు భావించారు. కానీ ఎటువంటి పెంపులేకపోవడంతో సిగరెట్ తయారీ దారులు ఊపిరి పీల్చుకున్నారు.(చదవండి: బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి!)

వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ప్రవేశపెట్టిన అగ్రిసెస్‌ను మద్యం మీద ప్రవేశపెట్టారు. కానీ, పొగాకు ఉత్పత్తులపై మీద విధించలేదు. ఐటీసీ, ఇతర సిగరెట్ తయారీ సంస్థల స్టాక్స్ బడ్జెట్ ప్రకటనకు ముందు ఎక్కువ మంది తమ స్టాక్స్ ను అమ్ముకోవడాని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీనిపై ఎటువంటి ప్రకటన లేకపోవడంతో సిగరెట్ తయారీ సంస్థలు కొంచం ఉపశమనం లభించింది. బ్రోకరేజ్ సంస్థ ఎడెల్విస్ సెక్యూరిటీస్ ప్రకారం, ఈ ఏడాది బడ్జెట్ లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై పన్నుల పెంపు విధించే అవకాశం తక్కువగా ఉంటుంది అని అంచనా వేసింది. ఎందుకంటే గత ఏడాది 2020 బడ్జెట్ లో ఎక్కువ మొత్తంలో పన్ను విధించారు.
 

మరిన్ని వార్తలు